Site icon PRASHNA AYUDHAM

ద్రౌపతి మురుమను,సోనియా గాంధీ అన్న మాటలు దురదృష్టకరం

IMG 20250201 WA0320

ఖండించిన కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు గొడుగు శ్రీధర్
ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి1
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు సోనియా గాంధీ అన్న మాటలు దురదృష్టకరమని భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు తీవ్రంగా ఖండించారు. ఒక గిరిజన మహిళ భారత అత్యున్నత పదవిని అధిష్టిస్తే పరాయి దేశం నుండి వచ్చిన మీకు మతిభ్రమించిందనీ విమర్శించారు. సముచితమైన గౌరవాన్ని అందించింది ఈ భారతదేశం అని అన్నారు వెంటనే రాష్ట్రపతి ముర్ము కి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల తరపున డిమాండ్ చేశారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకు పూనుకుంటామని హెచ్చరించారు.

Exit mobile version