ఫీల్డ్ అసిస్టెంట్ ల పనిని మాటల్లో వర్ణించలేం:జిల్లా అధ్యక్షుడు కొండయ్య 

ఫీల్డ్ అసిస్టెంట్ ల పనిని మాటల్లో వర్ణించలేం:జిల్లా అధ్యక్షుడు కొండయ్య

వెంటనే జీతాలు విడుదల చేయాలనీ ప్రభుత్వానికి డిమాండ్

ప్రశ్న ఆయుధం 13 ఏప్రిల్ ( బాన్సువాడ ప్రతినిధి )

గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీపథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ లకు సకాలంలో వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గత మూడు నాలుగు నెలల నుండి వేతనాలు సకాలంలో అందక నానా కష్టాలు పడుతున్నారు.ప్రజా పాలనలో ఉద్యోగుల కష్టాలు ఒకటవ తారీఖున వేతనాలు చెల్లిస్తున్నామని మాటలు తప్ప అమలు కావడం లేదని ఫీల్డ్ అసిస్టెంట్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బేగరి కొండయ్య మండిపడ్డారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…ఉపాధి హామీ పథకంలో కూలీలతో పనులు చేయించడం ఫీల్డ్ అసిస్టెంట్ల పనిని మాటల్లో వర్ణించలేమని ఆయన తెలిపారు.గత నాలుగు ఐదు నెలల క్రితం ప్రతినెల వచ్చే వేతనాలు మూడు నాలుగు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment