సనాతన ధర్మం పైపు ప్రపంచం.. భారత్‌లో పెరుగుతున్న క్రైస్తవ జనాభా..?
హైందవం ఒక మతం కాదు. అది జీవనశైలి. సనాతన ధర్మమే హైందవానికి ప్రాతిపదిక. సనాతనం అంటే అతి పురాతనం కానీ, నిత్యనవీనం. సత్యం, పరోపకారం, త్యాగం, సేవ, ప్రేమ ఇవన్నీ సనాతన ధర్మ మార్గాలు.
ప్రపంచ మతాలు అన్నిటిలో హిందూ మతమే అతి పురాతనమైనది. నేడు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సనాతన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. అమెరికా, రష్యా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్ వంటి దేశాల పౌరులు ఆధ్యాత్మిక శాంతి, సమతుల్య జీవితం కోసం దీనిని అవలంబిస్తున్నారు. ముఖ్యంగా యోగా, ధ్యానం, వేదాలు, భగవద్గీత బోధనలు వారిని చాలా ప్రభావితం చేస్తున్నాయి. రష్యాలో వేలాది మంది ఇస్కాన్‌లో చేరి భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నారు. అమెరికాలో కూడా, చాలా మంది ప్రముఖులు సనాతన జీవనశైలిని అవలంబించడం కనిపించడం ప్రారంభించారు. నేటికీ బాలి (ఇండోనేషియా)లో హిందూ ఆచారాలు లోతుగా పాతుకుపోయాయి. జపాన్, కెనడా, నేపాల్ వంటి దేశాలలో కూడా ప్రజలకు వేదాంత, ఆరాధనపై ఆసక్తి పెరిగింది. సనాతన ధర్మం ఇప్పుడు ప్రపంచ స్పృహలో భాగమవుతోందని స్పష్టంగా తెలుస్తుంది. ప్రపంచం మొత్తం సనాతన ధర్మంలో మునిగి తేలుతుంటే.. భారత్‌లో మాత్రం క్రైస్తవ జనాభా పెరుతోందట!
ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ జనాభాలో క్షీణత ఉన్నప్పటికీ.. భారతదేశంలో మాత్రం క్రైస్తవ జనాభా వేగంగా పెరుగుతోంది. గత దశాబ్దంలో క్రైస్తవ జనాభా 23.40 లక్షలు పెరిగింది. 2010లో దేశంలో క్రైస్తవ జనాభా 287,20000, ఇది 2020 నాటికి 310,60,000కి పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా క్రైత్సవ జనాభా 28.8 శాతం. అయితే.. ఇస్లాం ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మతం. 2010 – 2020 మధ్య ముస్లిం జనాభాలో భారీగా వృద్ధి కనిపించింది. ప్రపంచ జనాభాలో ముస్లింలు 25.6 శాతంగా ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలో నాలుగో వంతు ముస్లింలే ఉన్నారు. 2010 సంవత్సరంలో ఇది 23.9 శాతంగా ఉండేది. గత దశాబ్దంలో 34.6 కోట్లు పెరిగింది…