ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు శానిటేషన్ కార్మికుల మృతి
మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం ఆగస్టు 11
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన భయంకర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు శానిటేషన్ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసుల సమాచారం ప్రకారం, గాజువాక నుంచి సెల్ఫోన్ టవర్ సామగ్రితో మేడ్చల్ వైపు వెళ్తున్న టాటా ఇంట్రా వాహనం, ఘట్కేసర్ నుంచి షామీర్పేట్ వైపు వెళ్తున్న సమయంలో, రహదారిపై పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన నారాయణ (28), చెక్మోహన్ (24), జైరామ్ (32) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్ గణేష్ మద్యం మత్తులో వాహనం నడపడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.