యువకుడు అదృశ్యం

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 25(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కుల గ్రామానికి చెందిన చెన్నాపూర్ నవీన్ (21) అనే యువకుడు అదృశ్యమయ్యారు. బుధవారం పాలం వద్ద నుంచి ఇంటికి వెళ్లి పశువులను తీసుకువస్తానని చెప్పి వెళ్లిన నవీన్ తిరిగి రాలేదని, బంధువుల వద్ద ఎక్కడ వెతికిన ఆచూకీ లభించలేదని తండ్రి యాదయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన శివ్వంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Join WhatsApp

Join Now