సంగారెడ్డి/హత్నూర, డిసెంబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): నూతనంగా గెలిచిన సర్పంచులు, ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో పని చేస్తేనే గ్రామాలు అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ స్వప్న అన్నారు. మంగళవారం హత్నూర రైతు వేదికలో మండలంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచులకు పరిచయ కార్యక్రమంతో పాటు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఈఓ స్వప్న మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ కీలకంగా పని చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. గ్రామ కార్యదర్శిలు నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సహకరించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, ఎంపీఈఓ యూసుఫ్, ఏఈ శ్రీనివాస్, ఏపీఎం రాజశేఖర్, మండల ఎన్నికల ఇన్చార్జిగా పనిచేసిన నరేంద్ర, ఆయా గ్రామాల సర్పంచులు అధికారులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో పని చేయాలి: జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో స్వప్న
Oplus_16908288