ఆర్మూర్ మెడికల్ షాప్ లో దొంగతనం
నిజామాబాద్ జిల్లా డిసెంబర్ 11
ఆర్మూర్ మండలంలో బుధవారం తెల్లవారు దొంగలు బీభత్సం సృష్టించారు.బస్టాండ్ సమీపంలోని ఓ మెడికల్ షాప్లో చోరీ చేశారు.ఉదయం 4 గంటలకు గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీ జరిగిన మెడికల్ షాప్ నుంచి సీసీ కెమెరా డివిఆర్ ను సైతం ఎత్తుకెళ్లారు.