*మల్లన్నపై కేసు నమోదు చేయడంతో నిరసన తెలిపిన తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు*
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 28 (ప్రశ్న ఆయుధం న్యూస్): తీన్మార్ మల్లన్నపై రెడ్డి జాగృతి సంఘం కేసు నమోదు చేయడంతో జహీరాబాద్ లో తెలిపిన తీన్మార్ మల్లన్న టీమ్ సభ్యులు నిరసన తెలిపారు. తీన్మార్ మల్లన్న మీద హైదరాబాద్ రెడ్డి జాగృతి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి నందున తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు శనివారం జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు రమేష్ యాదవ్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న సామాన్య ఓసి ప్రజలకు లాభం జరిగే విధంగా మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీలకు రాజ్యాధికారం కోసం మేమెంతో మాకు అంత అన్న నినాదంతో ప్రతిరోజు జనాభా ప్రాతిపదికన లెక్కలతో సహా ప్రజలకు వివరిస్తుంటే తట్టుకోలేని కొంత మంది రెడ్డి జాగృతి కి చెందిన పలువురు తీన్మార్ మల్లన్నను టార్గెట్ చేస్తూ రాజీనామా చేయాలని అరెస్టు చేయాలని వారు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్ మల్లన్న టీం సభ్యులు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు, దిష్టి బొమ్మ దహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఎవరైనా కూడా తీన్మార్ మల్లన్న మీద ఇలాంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని టీం సభ్యులు హెచ్చరించారు. ప్రజల కోసం అనుక్షణం పాటుపడే తీన్మార్ మల్లన్న కోసం రాష్ట్ర బహుజన బిడ్డ లంతా అండగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ యాదవ్ తో పాటు జహీరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి నరసింహ తదితరులు పాల్గొన్నారు.