హైకోర్టు స్పందించిన* *అధికారుల చర్యలు లేవు

హైకోర్టు స్పందించిన అధికారుల చర్యలు లేవు

సెప్టెంబర్ మాసం 2022 సంవత్సరంలో గుండ్ల హనుమాన్ ఆలయం పక్కన ఎస్ వి రెసిడెన్సి ఎదురుగా నిబంధనాలకు వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా పేలుడు పదార్థాలను వినియోగించి భారీ పేలుళ్లకు పాల్పడ్డారు. అనేక మందితో పాటు రమాదేవి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా సిసి పుటేజులను పరిశీలించి పేలుళ్లు జరిగిన వాస్తవాలను గుర్తించారు. పోలీసు ,రెవెన్యూ మున్సిపల్ సంబంధిత అధికారులు పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు . రమాదేవి కి జరిగిన నష్టాన్ని తెలుసుకొని వివరాలు సేకరించారు పూర్తి వివరాలు ఆధారాలతో అనేక మందితో పాటు రమాదేవి కుటుంబ సభ్యులు అధికారులకు ఇవ్వడం జరిగింది. వీటన్నింటికీ బాధ్యులైన ఒంటెల సుమ , ఒంటెల సత్యనారాయణ రెడ్డి వారి అనుచరులు రమాదేవి కుటుంబ సభ్యులపై తీవ్ర ఒత్తిడి చేస్తూ బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తూ అరాచకాలు చేస్తూ ఆక్రమణలు చేస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తూ కూల్చితూ వేధింపులకు పాల్పడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామంటూ అనేక విధాలుగా వేధింపులు బెదిరింపులు దౌర్జన్యాలు అధికమైనవి. అనేక సంఘాలు న్యాయవాదులు నిజనిర్ధారణ చేసి బహిరంగంగా ప్రశ్నించిన అధికారులు చర్యలు తీసుకోలేదు. ఎప్పటి కప్పుడు సంబంధిత శాఖల అధికారులతో పాటు రాష్ట్ర ఉన్నత అధికారులకు గవర్నర్కు హైకోర్టుకు వివరిస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. స్పందించిన రాష్ట్ర గవర్నర్ చర్యలు చేపట్టాలని సూచించినప్పటికిని నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా రమాదేవి వారి కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తూ 9ఆగస్టు2024న ఇంటిపై ఒంటెల సుమ ఒంటెల సత్యనారాయణ రెడ్డి మహిళలు పోలీసులు వారి అనుచరులతో దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను ధ్వంసం చేసి విలువైన వస్తువులను పత్రాలను తీసుకెళ్లి ఇంటి ఆవరణంలో ఉన్న చెట్టును కొట్టేస్తూ ఇంటి హద్దులను చెరిపివేస్తూ నానా విధాలుగా బీభత్సాన్ని సృష్టించారు. అదే రోజు రాత్రి పోలీసులు వచ్చి ఫిర్యాదులు స్వీకరించినారు. మరుసటి రోజు ఏసీపి స్థానిక సీఐ ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై హైకోర్టుకు వివరించగా స్పందించి వెంటనే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం జరిగింది. నేటికీ ఎలాంటి చర్యక తీసుకోకపోగా ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారులు ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. రమాదేవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రజలు కోరుచున్నారు.

Join WhatsApp

Join Now