*కల్తీపై కేంద్రం సీరియస్.. జగన్‌కు చిక్కులు తప్పవా..* తిరుమల లడ్డూ వ్యవహారం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలు చాలా సీరియస్‌గా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు ఎంతో భక్తిభావంతో స్వీకరించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడంపై కన్నెర్ర చేస్తున్నారు. అసలేం జరిగిందంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో మాట్లాడారు.
లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ చేయడంలో నిజానిజాలేంత అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నెయ్యి నాణ్యత, కల్తీపై ఉన్న నివేదికలను అందించాల్సిందిగా సీఎం చంద్రబాబును కేంద్ర మంత్రి కోరారు. రాష్ట్ర నియంత్రణ అధికారులతో కూడా జేపీ నడ్డా మాట్లాడారు. ఆహార భద్రత ప్రమాణాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి చెప్పారు.