ఉన్నోడికో న్యాయం..లేనోడికో న్యాయం.?

*మాకు కూడా ఐటిసి వారి గోదావరి నీళ్లు ఇవ్వండి మహాప్రభో…*

 

*ఒక అధికారి ఇంటి కోసం బడా అధికారి చెబితే కొద్ది దూరంలోనే మంచినీటి పైప్లైన్ ఏర్పాటుచేసిన ఐటీసీ వారు…*

 

*కొన్ని సంవత్సరాల నుంచి మంచినీటి పైప్ లైన్ కావాలని స్థానిక ప్రజల కోరుతున్నా పట్టించుకోని ఐటిసి వారు…?*

 

*ఉన్నోడికో న్యాయం లేనోడికో న్యాయం అన్నట్టు వ్యవహరిస్తున్న ఐ టి సి…?*

 

*పైపులైన్ల లీకేజీ వలన మిషన్ భగీరథ నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి…?*

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

బూర్గంపాడు మండలం సారపాక పరిధిలోగల రాజీవ్ నగర్ సాయిబాబా గుడి దారిలో సుబ్బరాజు ఇంటి వద్ద ఆల్రెడీ ఒక మంచినీటి ఐటిసి పైప్లైన్ ఉంది మరల కొద్ది దూరంలోనే ఓ అధికారి ఇంటి కోసం, ఓ బడా అధికారి ఆర్డర్ అట అందుకోసమే మంచినీటి పైప్లైన్ ఏర్పాటుచేసిన ఐటిసి వారు.

 

గాంధీనగర్, రాజీవ్ నగర్ విజయనగర్, భాస్కర్ నగర్ ప్రాంత ప్రజలకు మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని ఐ టి సి వారు.? 

 

ఒక వ్యక్తి ఇంటి కోసం కొద్ది దూరంలోనే గోదావరి పైప్ లైన్ వేయటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్న ప్రజలు.?

 

ప్రజల అవసరాలతో పనిలేదు ఉన్నోడికి ఒక న్యాయం లేనోడికి ఒక న్యాయం చేస్తున్న ఐటిసి ఎవరైనా ధనం ఉన్న వ్యక్తి బడా అధికారులతో చెప్పిస్తే చాలు పక్కపక్కనే పైపులైను వేస్తారని, ప్రజల అవసరాల కోసం గోదావరి పైప్ లైన్ వేయండి అని ఎన్నో సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్న అటు ఐటిసి వారు కానీ ఇటు పంచాయతీ అధికారులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ ఒక్క ఇంటి కోసం ఓ బడా అధికారి ఆర్డర్ వేశాడట? వెంటనే అమలుపరిచిన ఐటిసి ఇదెక్కడి న్యాయం అని ఆవేదన వ్యక్తం చేస్తున్న నీటి అవసరాల కోసం ఎదురు చూసే ప్రజలు.

 

*మిషన్ భగీరథ పైప్ లైన్ నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలియదు..?*

 

 ఐ టి సి దత్తత గ్రామాలకు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో గోదావరి పైప్ లైను వేయాలని సంబంధిత అధికారులను, ఐటిసి యజమాన్యం వారిని మరియు మండల జిల్లా అధికారులను వేడుకుంటున్న ప్రజలు…

Join WhatsApp

Join Now