ముందస్తు అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు

*ముందస్తు అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదు*

*మున్సిపల్ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు*

*జమ్మికుంట జనవరి 9 ప్రశ్న ఆయుధం*

కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ముందస్తు అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు అన్నారు.బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు పై వచ్చిన అభియోగాలను ఆయన తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ ఏసీబీ విచారణలో భాగంగా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వర్ రావు ని జమ్మికుంట పోలీసులు ముందస్తుగా వారి నివాసంలో హౌస్ అరెస్టు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ప్రజలు గమనిస్తున్నారని ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఆమలుపర్చడంలో విఫలమైందని అధికారం శాశ్వతం కాదని మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా మూల్యం చెల్లించక తప్పదని మండిపడ్డాడు ప్రజలు త్వరలో జరగనున్న స్థానిక సంస్థలలో సమాధానం చెప్తారని పేర్కొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment