ముందు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేదు వెనుక వచ్చిన వాళ్ళకి ఇబ్బంది ఉంది
జుక్కల్ సెప్టెంబర్ 28 ప్రశ్న ఆయుధం
శనివారం రోజు నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు కే నర్సింహారెడ్డి అధ్యక్షతన మహాజనసభ నిర్వహించారు. జవా మరియు ఖర్చుల గురించి చర్చించారు. తదితర అంశాలు సమస్యల పైన ఆరా తీశారు. రైతులు మాట్లాడుతూ వడ్లు ముందు వచ్చిన వాళ్లకు ఇబ్బంది లేదు వెనకాల వచ్చిన వారికి ఇబ్బంది ఉందని ఏదైనా సమస్య ఎదురైతే డబ్బులు కట్టాల్సిందేనని పేర్కొన్నారు. గతం మాగి గ్రామంలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయని పలువురు తెలియజేశారు. నీళ్ల కోసం హమాలీలు ఇబ్బంది పడాల్సి వస్తుందని రైతులు పేర్కొన్నారు. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి , అచ్చంపేట్ పి ఏ సి ఎస్ సెక్రెటరీ సంగమేశ్వర్ గౌడ్, రమేష్ గౌడ్, శ్రీనివాస్, పిఎసిఎస్ సిబ్బంది ,రైతులు ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.