అందులో మా భర్త పేరిట ఒక్క గుంట భూమి లేదు

  • పేలుడు పదార్థాల నిల్వ కేసులో నా భర్త చంద్రశేఖర్ రెడ్డి కి ఎలాంటి సంబంధం లేదు..
  • ఎలాంటి నోటీసు లేకుండానే అర్ధరాత్రి 12 గంటలకు అరెస్టు చేసి జైలుకు తరలించారు 
  • మా కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి, టీపిసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అండగా ఉన్నారు

-:శ్రీవారి వెంచర్ ను విబుస్ వెంచర్స్ వారికి 2023 లోనే అప్పజెప్పాము

    • అందులో మా భర్త పేరిట ఒక్క గుంట భూమి లేదు0
    • – రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే అక్రమ కేసులు
    • – మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియా చంద్రశేఖర్ రెడ్డి

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

నా భర్త టీ.పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్ట్ చేశారని కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డి లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాజకీయ కక్ష కారణంగా తమపై ఆరోపణలు చేస్తు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. తాము రాజకీయంగా ఎదుగుతున్న తీరుని భరించలేని కొందరు మాపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారన్నారు. నా భర్త ఎలాంటి తప్పు చేయలేదనీ, కాంగ్రెస్ పార్టీ పటిష్టకు కృషి చేస్తామన్నారు. పేలుడు పదార్థాల నిల్వ కేసులో నా భర్త చంద్రశేఖర్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారన్నారు. మా కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి, టీపిసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అండగా ఉన్నారని పేర్కొన్నారు. శ్రీవారి వెంచర్ ను విబుస్ వెంచర్స్ వారికి 2023 వ సంవత్సరంలోనే అప్పజెప్పామన్నారు. మా భర్త కు ఆ వెంచర్ తో ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదని, ఒక్క గుంట భూమి తన భర్త పేరు మీద లేదన్నారు. మా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే అక్రమ కేసులు పెట్టారని, కామారెడ్డి ప్రజలు ఇదంతా చూస్తున్నారని ఆ ప్రజలే త్వరలో నిర్ణయిస్తారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి కోసం తీవ్రంగా కృషి చేశామని తెలిపారు. తమ కృషి ని గుర్తించి చంద్రశేఖర్ రెడ్డికి టీ పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవిని కట్ట బెట్టరన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం లక్ష్యంగా మా కుటుంబం అతా పనీ చేస్తామన్నారు. సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎవరైనా తాము ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములులో ఉన్న బండరాళ్లను తీసివేసే సమయంలో ఈ బ్లాస్టింగ్లు సహజమన్నారు. ఎక్కడ జరగనట్లు ఇక్కడే జరిగిందని తమను టార్గెట్ చేసి కొందరు రాజకీయంగా ఇబ్బందికి గురి చేస్తున్నారన్నారు. తమను అరెస్టు చేయడానికి నిజంగా పోలీసుల వద్ద ఏదైనా సమాచారం, సాక్ష్యం ఉంటే తమకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసి ఉంటే మేము ఎవరిని తప్పు పట్టే వారిమి కాదని కావాలనే తమను ఈ కేసులో ఇ రికించారన్నారు. ఇదంతా కామారెడ్డి ప్రజలు గమనిస్తున్నారని, అధిష్టానం సైతం చూస్తుందని తమకు న్యాయం జరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment