రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇబ్బందులు లేని పంటల కొనుగోలు జరగాలి.

రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇబ్బందులు లేని పంటల కొనుగోలు జరగాలి.

 

మంత్రుల సూచనలు కలెక్టర్ల సమీక్ష

 

కామారెడ్డి జిల్లా ఇంచార్జ్

 

ప్రశ్న ఆయుధం నవంబర్ 10

 

రాబోయే మూడు నాలుగు వారాలు అప్రమత్తంగా ఉండి ధాన్యం, పత్తి, సోయా వంటి పంటల కొనుగోలు కేంద్రాల నిర్వహణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

 

సోమవారం సచివాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరా, సహకార, వ్యవసాయ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు.

 

కామారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.

 

మంత్రులు మాట్లాడుతూ – రాష్ట్రవ్యాప్తంగా పంటల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి, రైతులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే తరలించాలన్నారు. వాతావరణ పరిస్థితులను రైతులకు తెలియజేస్తూ అప్రమత్తంగా ఉంచాలని, కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు, మాచర్ మిషన్లు, గన్ని సంచులు, తార్పాలిన్లు, లారీలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

 

మిల్లర్లు, కాంట్రాక్టర్లు, హమాలీల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి పంటల కొనుగోళ్లు విజయవంతంగా నిర్వహించాలని మంత్రులు పేర్కొన్నారు.

 

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ – రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటల కొనుగోళ్లు జరగాలని, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.

 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాలో కంట్రోల్ ఏర్పాటు చేయడంతో పాటు రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 187 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డి సి ఎం ఎస్ ఆధ్వర్యంలో 233, ఐకెపి ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇద్దరమ్మాయిల నిర్మాణ పనుల గురించి సమీక్షించారు. నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మదర్ మోహన్, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ రవితేజ, జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డి ఆర్ డి ఓ పిడి సురేందర్, వ్యవసాయ శాఖ అధికారి మోహన్, డి సి ఓ రామ్మోహన్, డి ఎం జ్యోతి, సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now