తెర్లాం మండలం పెరుమాళిలో సొంత నిధులతో మంచినీటి ట్యాంకు నిర్మించిన ఎమ్మెల్యే బేబీనాయన ..

*తెర్లాం మండలం పెరుమాళిలో సొంత నిధులతో మంచినీటి ట్యాంకు నిర్మించిన ఎమ్మెల్యే బేబీనాయన ..*

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 16( ప్రశ్న ఆయుధం న్యూస్ )దత్తి మహేసరావు

బొబ్బిలి నియోజకవర్గం, తెర్లాం మండలం, పెరుమాళి గ్రామంలో చెగుడువీధి ప్రజలు మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం * ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన)* దృష్టికి రావడంతో, వెంటనే తన *సొంత నిధులతో బోరు తీయించి, మంచినీటి ట్యాంకును* ఏర్పాటు చేశారు..

ఎమ్మెల్యే బేబీనాయన చేతులమీదుగా మంచినీటి ట్యాంకును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నర్సుపల్లి వెంకట్ నాయుడు , ఎంపీపీ మరియు ZPTC ప్రతినిధి నర్సుపల్లి వెంకటేష్ , రాష్ట్ర సెక్రటరీ మోజూరు తేజోవతి , పెరుమాళి సర్పంచ్ ప్రతినిధి అప్పచ్చి రాజు , మాజీ ఎంపీటీసీ జగ్గరాజు , శ్రీ మర్రాపు శంకర్రావు , టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..!!

Join WhatsApp

Join Now

Leave a Comment