సింగరేణి పరిరక్షణతో పాటు ఈ పి ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి
ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 1 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
హైదరాబాదులో జిఎం కోఆర్డినేషన్ తడబోయిన శ్రీనివాస్ కి ఆపరేటర్ల వినతి అందజేశారు.
సింగరేణి పరిరక్షణకు కొత్త గనుల ఏర్పాటుతోపాటు, మణుగూరు పీకేఓసి విస్తరణ పనుల ప్రక్రియ ప్రారంభించాలని సింగరేణి వ్యాప్తంగా వివిధ ఉపరితల గనులలో పనిచేస్తున్న ఈ పీ ఆపరేటర్ల సమస్యల పరిశీలించాలని కోరుతూ సోమవారం సాయంత్రం హైదరాబాద్ సింగరేణి భవన్ లో జిఎం కోఆర్డినేషన్ గా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తడబోయిన శ్రీనివాస్ కి ఆపరేటర్ల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. జిఎం కోఆర్డినేషన్ గా సోమవారం నాడు పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు మొక్కను ఇచ్చి ఆపరేటర్ల తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆపరేటర్స్ నాయకులు యస్ డి నా సర్ పాషా మాట్లాడుతూ సింగరేణి పరిరక్షణకు ఇంకా కొత్త గనుల ప్రారంభించాలనీ మణుగూరు ఏరియా మునుగడకై మణుగూరులో పీకే ఓసి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టాలని కోరారు అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా ఓసి గనులలో పనిచేస్తున్న ఈ పి ఆపరేటర్ల దీర్ఘకాలిక సమస్య సూటబుల్ జాబ్ సమస్యను పరిష్కరించాలనీ,రామగుండం రీజియన్ ఆపరేటర్ల పదోన్నతుల లేఖలు అందజేయడం లో యాజమాన్యం తీవ్ర జాప్యం చేస్తున్నదనీ ఆపరేటర్ల ఆవేదన చెందుతున్నారని వీటితో పాటు “సీ”గ్రేడ్ ఖాళీల భర్తీకి త్వరితగతిన తగు చర్యలు చేపట్టాలి సింగరేణి వ్యాప్తంగా ఆపరేటర్లకు సంబంధించి టైం బాండ్ ప్రమోషన్ పాలసీ అమలు చేయాలనీ, సింగరేణి వార్షిక లాభాల వాటాలలో సింగరేణి ఉత్పత్తి ఉత్పాదకతలలో ప్రధాన పాత్ర పోషించే ఆపరేటర్లకు కూడా తగు ప్రాధాన్యత ఇచ్చి న్యాయం చేయాలని, కొత్తగూడెం రీజియన్ నుండి గోదావరిఖని టిటిసి కి పలు శిక్షణల నిమిత్తం యాజమాన్యం పంపించే వారికి రాను బోను ఓడి ఇవ్వాలనీ, సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేయాలని ఆ వినతి పత్రంలో ఆయన కోరారు.