విద్యతో పాటు పిల్లలకు కల్లపట్ల ఆసక్తి కలిగి ఉండాలని అవి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి
*పిల్లల సమగ్ర అభివృద్ధి కి కళలు తోడ్పడుతాయి*
*మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య*
*హుజురాబాద్ సెప్టెంబర్ 16 ప్రశ్న ఆయుధం*
విద్యనభ్యసించే సమయంలో పిల్లలకు చదువుతోపాటు కలల పట్ల ఆసక్తి ఉండాలని, కలలు పిల్లల మానసిక వికాసం తో పాటు సమగ్రాభివృద్ధికి తోడ్పడతాయని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య అన్నారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని విఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో మండల స్థాయి కల ఉత్సవాలు నిర్వహించారు మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు గురుకుల పాఠశాలలకు చెందిన 12 రకాల అంశాలలో 90 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసించే సమయంలో విద్యతో పాటు 64 కలలలో కొన్నింటిలోనైనా ప్రావీణ్యత పొందాలని మన దేశం కలలకు పుట్టిళ్ళని, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతంలో అనేక గ్రామీణ కలలు ఉన్నాయని పేర్కొన్నారు ఎంఈఓ బి శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లల సమగ్ర అభివృద్ధికి కలోత్సవాలు దోహదపడతాయని కాగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి 12 రకాల అంశాల్లో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి.తిరుమల అనురాధ సంపత్ సతీష్ కూర్మాచలం వెంకటేశ్వర్లు, సీఆర్పీ దామోదర చారి రవిబాబు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు