గాంధారిలో దొంగల బీభత్సం
ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 21, కామారెడ్డి
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని
కమ్మరిగల్లీలో కుమ్మరి రంజిత్ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా ఇంటికి తాళం వేసి గురు వారం వేములవాడ దర్శనానికి వెళ్లి తిరిగి శుక్రవారం సాయంత్రం వచ్చేసరికి ఇంటి తలుపు, తాళం పగలగొట్టి ఇంట్లోని బీరువ పగలగొట్టి బీరువాలో గల బంగారు వంకు, బంగారు గుండ్లు, బంగారు నక్లెస్, దాదాపు మొత్తం 7 తులాలు నగదు దొంగలు దోచుకెళ్లారు. కుమ్మరి రంజిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎవరైనా ఇంటికి తాళాలు వేసి వెళ్లినచో గాంధారి పోలీసులకు సమాచారం ఇవ్వగలరని తెలిపారు. అదేవిధంగా గల్లీలోకి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చిన త్వరగా పోలీసులకు సమాచారం ఇవ్వగలరని ఎస్సై ఆంజనేయులు, సిఐ సంతోష్ కుమార్ లు తెలిపారు.