సత్యనారాయణ స్వామి గుడిలో దొంగలు.రెండవ దొంగతనం.గతరాత్రి సారపాక ఆంజనేయస్వామి గుడిలో దొంగలు పడ్డ విషయం తెలిసిందే కాగ సారపాక పట్టణ పరిధిలోని తాళ్ళగోమ్మూరు గ్రామపంచాయతీ సమీపంలో గల సత్యనారాయణ స్వామి ఆలయంలో గత రాత్రి దొంగలు హల్ చల్ చేశారు. ఇది పట్టణంలో రెండవ దొంగతనం అని చెప్పుకోవచ్చు హుండీ పగలగొట్టి అందులో డబ్బు దోచుకెళ్ళినట్టు సమాచారం. దాదాపు 3 నుండి 4 సంవత్సరాలుగా అట్టి హుండీని తెరవలేదు అని, ఇందులో భారీ మొత్తంలో డబ్బులు ఉండవచ్చని ప్రజలు చర్చలు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.