Site icon PRASHNA AYUDHAM

తిమ్మాపూర్ గ్రామం లో దొంగల భీభత్సం……

తిమ్మాపూర్ గ్రామం లో దొంగల భీభత్సం……

ఇంట్లో చొరబడి నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు..

నమోదు చేసి దర్యాప్తు చేస్తుకేసున్న పోలీసులు..

మెదక్ జిల్లా శివ్వంపేట
మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో దొంగలు ఇంట్లో చొరబడి నగదు ఎత్తుకెళ్లిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహిపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మాసంగారి సురేష్ మంగళవారం తన కుటుంబంతో కలిసి బంధువుల ఇంట్లో శుభ కార్యానికని హత్నూర మండలం బోరపట్లకు బయలుదేరి వెళ్లారు.తాళం పగలకొట్టి సురేష్ ఇంటి

తలుపులు తెరిచి ఉన్నాయని సురేష్ సోదరుని పిల్లలు చూసి తల్లిదండ్రులకు తెలుపగ వాళ్ళు ఇంట్లోకి వెళ్లి చూసే సరికి ఇంట్లోని బీరువా పగులగొట్టిన దొంగలు అందులోని నగదు, ఆభరణాలను ఎట్టుకెళ్లినట్లు గమనించి, ఫోన్ ద్వారా విషయాన్నీ సురేష్ కు అందజేశారు. సురేష్ ఇక్కడికి వచ్చి చూడగా బీరువాలో దాచిన 60 వేల రూపాయల నగదు, తులం బంగారం, 20 తులాల వెండి వస్తువులు దొంగలిచినట్లు గుర్తించిన్నట్లు తెలిపారు. సురేష్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సురేష్ ఇంటిని క్లూస్ టీమ్ తనిఖీలు చేపట్టడం జరిగినది.

Exit mobile version