*మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది..!!*
ఉక్రెయిన్ మాజీ కమాండర్ వాలెరీ జలుజ్నీ ప్రకటన
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న వివాదం చూస్తుంటే మూడవ ప్రపంచ యుద్ధం ప్రా రంభమైందని ఉక్రెయిన్ మిలిటరీ మాజీ కమాండర్ వాలెరీ జలుజ్నీ వెల్లడించారు.
ప్రస్తుతం యూకేలో ఉక్రెయిన్ రాయబారిగా పనిచేస్తున్న జలుజ్నీ.. రష్యా నిరంకుశ మిత్ర దేశాలు యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయని.. ఇది క్రమంగా ప్రపంచమంతా విస్తరిస్తుందని తెలిపారు.
‘2024లో మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైందని మనం విశ్వసించగలమని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను’ అని ఉక్రెయిన్ లోని ఓ కార్యక్రమంలో వెల్లడించారు. ఉక్రెయిన్ సైనికులు ధైర్యంగా ఉండాలని.. రష్యాకు ఇరాన్, నార్త్ కొరియా, చైనా ఆయుధాలు సరఫరా చేస్తూ.. యుద్ధా నికి సహకరిస్తున్నాయని ఆరోపించారు. ఈ యుద్ధం దేశ సరిహద్దులు దాటి మరింతగా విస్తరించకుండా నిరోధించాలని తెలిపారు. యుద్ధాన్ని ఆపడం ఉక్రెయిన్ కు సాధ్యమే కానీ.. తమ దేశానికి ఎక్కువ మంది శత్రువులు ఉన్నా రని చెప్పుకొచ్చారు.