*కెటిఆర్ పై ఈ కార్ రేస్ కేసు విచారణ పేరు తో కుట్ర పూరితమైన చర్యలు మానుకోవాలి..*
*మారబోయిన రవి యాదవ్.*
*ప్రశ్న ఆయుధం, జూన్ 17, శేరిలింగంపల్లి,ప్రతినిధి*
శేరిలింగంపల్లి నియోజకవర్గం మసీద్ బండ లోని బి ఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో బి.ఆర్.ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు మారబోయిన రవియాదవ్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసి ఈ కార్ రేస్ కేసు విచారణ పేరుతో పార్టీ నాయకుణ్ణి బద్నాం చేసే కార్యక్రమం ను పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు ఎన్ని చిల్లర ప్రచారాలు చేసిన ప్రజల మద్దతు కె.టి.ఆర్ కు బి ఆర్ ఎస్ పార్టీ కి చెక్కు చెదరకుండా ఉంటుందని అన్నారు. ప్రజల కి సమస్యలు సృష్టించిన కాంగ్రెస్ అవినీతి అక్రమాలు త్వరలోనే బయటపడతాయి ప్రభుత్వాన్ని పరిపాలించడం చాతకాక కెసిఆర్ పై కేటీఆర్ పై హరీష్ రావు పై తప్పుడు కేసులు పెట్టడం వల్ల పార్టీ ప్రతిష్ట ను దెబ్బ తీయాలని ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ కి శృంగ భంగం తప్పదు అని మారబోయిన రవి యాదవ్ హెచ్చరించడం జరిగింది.