*’ఇది మామూలు విజయం కాదు’*
TG: కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మల్క కొమురయ్యకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇది మామూలు విజయం కాదు.. మల్క కొమురయ్య ఐదు వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించడం చాలా గొప్ప విషయమన్నారు. మోదీ మీదున్న నమ్మకమే దేశ వ్యాప్తంగా బీజేపీ విజయానికి బాటలు వేస్తోందని తెలిపారు. టీచర్ల సమస్యల కోసం కొమురయ్య కృషి చేస్తారని.. ఇది తన హామీ అని బండి సంజయ్ భరోసా ఇచ్చారు.