ఇది భారత బడ్జెట్ కాదు బీహార్ బడ్జెట్

*ఇది భారత బడ్జెట్ కాదు బీహార్ బడ్జెట్*

*ఎన్.ఎస్.యు.ఐ నాయకుడు గొల్ల జాన్*

*ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 02:కుత్బుల్లాపూర్ ప్రతినిధి*

కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి పైసా కూడా కేటాయించలేదని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ వల్ల సామాన్యులకు లబ్ది లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అడిగిన వాటికి సంబంధించి బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు జరగలేదని గొల్లజాన్ మండిపడ్డారు. రాష్ట్రం నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ తెలంగాణ కు కేంద్రం నుంచి తెచ్చింది ఏమీ లేదన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment