స్నేహం అంటేనే ఊపిరి.. స్నేహితుల దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర ఇదే..

ఆగస్టు మొదటి ఆదివారం రోజున ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారు. భారతదేశంలో పాటు బంగ్లాదేశ్, యూఏఈ, మలేషియా, మరికొన్ని దేశాలు కూడా అదే రోజున స్నేహ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

 

ఆగస్టు మొదటి ఆదివారం రోజున ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారు. భారతదేశంలో పాటు బంగ్లాదేశ్, యూఏఈ, మలేషియా, మరికొన్ని దేశాలు కూడా అదే రోజున స్నేహ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఇందులో భాగంగా కరీంనగర్ లో దీప్తి ఫిట్నెస్ స్టూడియో వారు స్నేహ ప్రపంచం చాటేందుకు ఫ్రెండ్షిప్ డే వేడుకలు నిర్వహించారు.. ఒకరికి ఒకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకొని హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని విషెస్ చెప్పుకొంటూ ఒకరికి ఒకరు అలింగనం చేసుకుంటూ సెలబ్రేషన్ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజమైన స్నేహితులకు వయసు, రంగు, కులంపై ఎటువంటి పరిమితిలేవీ చూడరు. ఒక్కసారి స్నేహబంధం ఏర్పడితే జీవితాంతం కష్టసుఖాల్లో తోడుగా నిలబడతారు..మంచి స్నేహితులు ఉంటే జీవితంలో ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోగలమని వారు లోకల్ 18కి తెలిపారు..అలాగే ఈ రోజు స్నేహితుల ప్రాముఖ్యతను, మన జీవితంలో వారు పోషిస్తున్న విలువైన పాత్రను గౌరవిస్తుంది. అలాగే గుర్తిస్తుంది కూడాబంధాలను బలోపేతం చేయడానికి, స్నేహాలు తీసుకువచ్చే ఆనందాన్ని జరుపుకోవడానికి ఒక అవకాశంగా ఈ ఫ్రెండ్షిప్ డే పనిచేస్తుంది. ఈ రోజున, ప్రజలు సాధారణంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రోజున తన స్నేహితులకు ఇష్టమైన సందేశాలను పంపుతారు. స్నేహితులతో కలిసి సమయాన్ని గడుపుతారు..మన జీవితాలను సుసంపన్నం చేసే సంబంధాలలో స్నేహితులు భాగమే..ఫ్రెండ్షిప్ డే ఎలా వచ్చిందంటే హాల్మార్క్ కార్డ్స్ వ్యవస్థాపకుడు హిస్టరీ జాయిస్ హాల్ స్నేహానికి కృతజ్ఞత తెలియజేయడానికి ఒక రోజును కేటాయించాలని ప్రతిపాదించారు. ఐక్యరాజ్యసమితి జూలై 30ని అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించడంతో ఫ్రెండ్ షిప్ డే సెలబ్రేషన్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. కానీ భారత దేశం ఆగష్టు మొదటి వారం జరుపుకుంటుంది. దేశాలు, సంస్కృతులు, వ్యక్తుల మధ్య స్నేహం శాంతి ప్రయత్నాలకు ఇది స్ఫూర్తినిస్తుందని, సమాజాల మధ్య వారధులను నిర్మించగలదనే ఆలోచనతో 2011లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని ప్రకటించిం పేర్కొంది..

 

Join WhatsApp

Join Now