పోలీస్ స్టేషన్లోనే చోరీ జరిగితే..? ఓర్నీ ఇదేంది..?

: ఇది ఎప్పుడైనా విన్నారా.. పోలీస్ స్టేష‌న్‌లోనే దొంగలు పడ్డారు..!*

ఎక్కడైనా చోరీ జరిగితే పోలీసులను ఆశ్రయిస్తారు బాధితులు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. మరి పోలీస్ స్టేషన్లోనే చోరీ జరిగితే..? ఓర్నీ ఇదేంది..? అనుకుంటున్నారా..? అవును.. గాజువాక పోలీస్ స్టేషన్లో అది జరిగింది.

మే 3న గాజువాకలో రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి ఓ బుల్లెట్ ను పోలీసులు సీజ్ చేశారు. దాన్ని పోలీస్ స్టేషన్లో ఉంచారు.

బుల్లెట్ యజమాని.. హరీశ్ కోర్టు నుంచి అనుమతితో వాహనం తీసుకోవడానికి స్టేషన్ కెళ్లాడు. తన వాహనం ఇవ్వాలని అక్కడ పోలీసులకు అడిగాడు. బుల్లెట్ ఇచ్చేందుకు సిద్ధమైన పోలీసులు.. దాన్ని పార్కింగ్ చేసిన చోటుకు వెళ్లి చూసారు. అక్కడ ఆ వాహనం కనిపించలేదు. దీంతో పోలీసులే షాకయ్యారు.

కాగా.. పోలీస్ స్టేషన్‌లోనే బైక్ లు మాయమవ్వడం కలకలం రేపింది.. ఇదివరకు పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు ఇప్పుడు ఉన్నాయో..? లేదో అని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

Join WhatsApp

Join Now