*ఈ కుబేర్ వ్యవస్థను రద్దు చేయాలి*
*స్టేట్ టీచర్స్ యూనియన్ నాయకులు*
*జమ్మికుంట /ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 12*
దీర్ఘకాలికంగా ఉపాధ్యాయులకు సంబంధించి కోట్లాది రూపాయలు ఈ కుబేర్లో పెండింగ్ లో ఉన్నాయని ఈ కుబేర్ వ్యవస్థను రద్దు చేసి గతంలో మాదిరిగా వెంటనే ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను సత్వరం మంజూరు చేయాలని స్టేట్ టీచర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఆర్ శ్రీనివాస్ కట్టా రవీంద్రాచారి లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం రాష్ట్ర కార్యదర్శి సాన కిషన్ తో కలిసి ఇల్లందకుంట మండలంలోని ఇల్లందకుంట కనగర్తి బూజునూరు సిరిసేడు టేకుర్తి మల్యాల రాచపల్లి చిన్న కోమటిపల్లి సీతంపేట శ్రీరాములపల్లి తదితర పాఠశాలలో సభ్యత్వ క్యాంపెయిన్ నిర్వహించి వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల జిపిఎఫ్ పార్ట్ ఫైనల్ లోన్లు సరెండర్ లీవ్ మెడికల్ బిల్లులకు సంబంధించి చాలా బిల్లులు ఈ కుబేర్ లో పెండింగ్లో ఉన్నాయని వాటిని చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు
పిఆర్సి నివేదికను వెంటనే బహిరంగపరిచి ఉపాధ్యాయ ఉద్యోగ, పెన్షనరులకు, మెరుగైన పిఆర్సి అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డీఏలను తక్షణం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర కార్యదర్శి కరీంనగర్ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి కోట శ్యామ్ కుమార్ నాయకులు రజాక్ పాషా పురుషోత్తం మూర్తి రవి నాయక్ కందుగుల రవి రామలక్ష్మి కౌసల్య లోకిని తిరుపతి తదితరులు పాల్గొన్నారు