ఈ పార్లమెంట్‌ సమావేశాలు ఎంతో కీలకం: ప్రధాని మోదీ

ఈ పార్లమెంట్‌ సమావేశాలు ఎంతో కీలకం: ప్రధాని మోదీ

 దిల్లీ: శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్‌ వద్ద ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు..

పార్లమెంట్‌లో ఫలవంతమైన చర్చలు జరగాలని అధికార, విపక్ష సభ్యులను మోదీ కోరారు.

ప్రస్తుతం మనం 2024ను పూర్తి చేసుకోబోతున్నాం. 2025 కోసం దేశం సిద్ధమవుతోంది. ఈ పార్లమెంట్ సమావేశాలు ఎన్నో అంశాలపరంగా ముఖ్యమైనవి. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ నవంబరు 26 నాటికి 75వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. దానికి గుర్తుగా రేపు సంవిధాన్‌ సదన్‌లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుందాం” అని మోదీ మీడియాతో మాట్లాడారు.

‘ప్రజల చేత తిరస్కరణకు గురైన కొందరు వ్యక్తులు.. కొందరి చేత గూండాయిజం చేయించి, పార్లమెంట్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి చర్యలను దేశ ప్రజలు చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు వారు చూస్తూ ఊరుకోరు. అయితే ఇక్కడ బాధించే విషయం ఏంటంటే.. పార్టీలతో సంబంధం లేకుండా కొత్తగా పార్లమెంట్‌కు ఎన్నికైనవారు కొత్త ఆలోచనలతో వస్తుంటారు. కొందరి గందరగోళ చర్యల వల్ల కొత్త ఎంపీలకు సభలో మాట్లాడే అవకాశం రావడం లేదు. వారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించరు. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోరు. వారికి ప్రజలపై ఎలాంటి బాధ్యత ఉండదు. అందుకే వారు ప్రజల అంచనాలను ఎన్నటికీ అందుకోలేరు” అని మోదీ సభా కార్యకలాపాలు సాగనివ్వనివారి తీరును ఆక్షేపించారు..

Join WhatsApp

Join Now

Leave a Comment