నల్గొండ అభివృద్ధిలో ఈ రింగ్ రోడ్డు గేమ్ చేంజర్..!!

*నల్గొండ రింగ్ రోడ్డు పనుల్లో వేగం పెంచండి*

*నల్గొండ అభివృద్ధిలో ఈ రింగ్ రోడ్డు గేమ్ చేంజర్*

*భూములు ఇచ్చేందుకు రైతులు,ప్లాట్ ఓనర్స్ ముందుకు వచ్చారు*

*అభివృద్ది కోసం ముందుకు వచ్చి భూములు ఇచ్చిన వారి త్యాగం గొప్పది*

*వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు*

*వారి ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయండి*

*ఇప్పుడైనా,ఎప్పుడైనా నల్గొండ అభివృద్దే నా మొదటి కర్తవ్యం*

*జిల్లా కలెక్టర్,ఆర్ అండ్ బి,రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలి*

– మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

*హైదరాబాద్:*

నల్గొండ పట్టణ రింగ్ రోడ్డు పై డా.బి.ఆర్ అంబేడ్కర్ తెలంగాణ సెక్రటేరియట్ లో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,NHAI రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్,ఆర్డీవో అశోక్ రెడ్డి, పి.ఎస్ చంద్ర మోహన్,ఆర్ అండ్ బి ఎస్.ఈ ధర్మారెడ్డి,డి.ఈ మురళి,డిప్యూటీ తహశీల్దార్ శివకుమార్,జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఈ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ..

“నల్గొండ అభివృద్ధిలో ఈ రింగ్ రోడ్డు గేమ్ చేంజర్ కాబోతుంది. భూములు ఇచ్చేందుకు రైతులు,ప్లాట్ ఓనర్స్ ముందుకు వచ్చారు. అభివృద్ది కోసం ముందుకు వచ్చి భూములు ఇచ్చిన వారి త్యాగం గొప్పది.వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.వారి ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేయండి. ఇప్పుడైనా,ఎప్పుడైనా నల్గొండ అభివృద్దే నా మొదటి కర్తవ్యం. జిల్లా కలెక్టర్,ఆర్ అండ్ బి,రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలి.” అని మంత్రి ఆదేశించారు.

పాన్ గల్,కొత్తపల్లి, అర్జల్ బావి,మర్రిగూడ ప్రాంతాల్లో భూసేకరణ పూర్తయిందని, భూ సేకరణ డబ్బులు చెల్లించాల్సి ఉందని..అట్లాగే నల్గొండ అర్బన్,మామిళ్ళగూడ ప్రాంతాల్లో భూసేకరణ పూర్తి చేసి డబ్బులు భూమి కోల్పోయిన వారి ఖాతాల్లో జమ చేసేందుకు ఖాతాల వివరాలు సేకరించామని మంత్రికి అధికారులు వివరించారు.

భూమి కోల్పోయిన వారి ఖాతాల్లో వెంటనే డబ్బులు జమ చేసే ఏర్పాట్లు చేయాలని NHAI రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ ను మంత్రి ఆదేశించారు. ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తానని, జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. భూములు కోల్పోతున్న వారి ఖాతాలో ఖచ్చితంగా వెంటనే డబ్బులు జమ కావాలని,క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి పారదర్శకతో వ్యవహరించాలని మంత్రి కోమటి రెడ్డి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, రెవెన్యూ అధికారులకు సూచన చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment