ఈసారి సగమే!!..

ఈసారి సగమే!!..

 

మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేసే చేప పిల్లల్లో కోత పడనుంది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం సగమే పంపిణీకి మత్స్య శాఖ కసరత్తు మొదలుపెట్టింది.చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతీ ఏడాది మే చివరిలో టెండర్‌ ప్రక్రియ పూర్తి అయ్యేది.. పంపిణీ సెప్టెంబర్‌ చివరి నాటికి తంతు ముగిసేది. ఈ ఏడాది ఇంకా టెండర్‌ ప్రక్రియనే కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4 వేలు చెరువులు..ఉమ్మడి మెదక్‌ జిల్లావ్యాప్తంగా 904 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు చెందిన 4,529 చెరువుల్లో చేపలు వదలనున్నారు. ఈ సంవత్సరం చేప పిల్లల పంపిణీ కోసం తొలుత ఆగస్టు 13న టెండర్లను ఓపెన్‌ చేయగా చేప పిల్లల సప్లయర్స్‌కు పెంపకం యూనిట్‌లు లేకుండా టెండర్లు వేశారని రద్దు చేశారు. తిరిగి సెప్టెంబర్‌ 9 నుంచి 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో టెండర్లు స్వీకరించారు. సిద్దిపేట జిల్లాలో ఇద్దరు, మెదక్‌లో నలుగురు టెండర్‌ వేయగా సంగారెడ్డిలో ఎవరూ టెండర్‌లు వేయలేదు. సిద్దిపేటలో చేప పిల్లల సరఫరా కోసం టెండర్లు వేసిన సప్లయర్స్‌ గురించి ప్రాథమిక పరిశీలన పూర్తి అయింది. మెదక్‌లో నలుగురు టెండర్లు వేయగా ప్రాథమిక పరిశీలనలోనే ఒకరు డిస్‌క్వాలిఫై అయ్యారు. సిద్దిపేట, మెదక్‌లకు చేప పిల్లల సరఫరా కోసం టెండర్లు వేసిన వాటిని ఫిజికల్‌గా వెళ్లి పరిశీలించనున్నారు. వారికి చేపల చెరువులు ఉంటేనే ఆ సప్లయర్స్‌ ఓకే అవుతాయి. లేకుంటే అవి సైతం డిస్‌క్వాలిఫై కానున్నాయి. ప్రతీ ఏడాది ఆగస్టు వరకు పంపిణీ.చేప పిల్లల పంపిణీ కోసం ఏప్రిల్‌లో టెండర్ల ప్రక్రియ ప్రారంభమయ్యేది. ఆగస్టు వరకు చేప పిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించేవారు. అలాంటిది సెప్టెంబర్‌ 21వ తేదీ దాటినా ఇంకా టెండర్ల ప్రక్రియే కొనసాగుతోంది. చెరువుల్లో 35 నుంచి 40ఎంఎం, 80 నుంచి 100 ఎంఎం పొడవున్న చేపపిల్లలను వదులుతారు. అవి కిలో సైజులో చేప పెరగాలంటే కనీసం 6 నుంచి 8 నెలల సమయం పడుతోంది. ఆగస్టులో వదిలితేనే జనవరి నుంచి ఫిబ్రవరి వరకు చేపలను పట్టి విక్రయించుకునే అవకాశం ఉంటుంది. చేప పిల్లలను ఆలస్యంగా వదిలితే ఎదుగుదలపై ప్రభావం పడనుంది. అక్టోబర్‌లో వదిలితే అవి కిలో సైజు పెరగాలంటే మార్చి దాటుతుంది. ఇంకా పెరగాలంటే వేసవి వచ్చేస్తుంది. ఉష్ణోగ్రతల కారణంగా చేపలు చనిపోయే ప్రమాదం ఉంటుందని పలువురు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

6.6 కోట్ల చేప పిల్లల పంపిణీకి మత్స్య శాఖ కసరత్తు

 

ఈనెల 19న టెండర్లు ఓపెన్‌ 

 

సిద్దిపేటలో ఇద్దరు, మెదక్‌లో నలుగురు 

 

సంగారెడ్డిలో ముందుకు రాని 

 

కాంట్రాక్టర్‌లు

 

*యేటా 13.22 కోట్ల చేప పిల్లలు* 

 

ప్రతీ ఏడాది 13.22కోట్ల చేప పిల్లలు ఉచితంగా పంపిణీ చేస్తే ఈ సారి 6.6 కోట్ల చేప పిల్లలే పంపిణీ చేయనున్నారు. అసలే చేపల పంపిణీ ఆలస్యం అవుతుంటే…. మరోవైపు సగానికి తగ్గించారు. సంగారెడ్డి జిల్లాలో చేపల పిల్లల సరఫరాకు కాంట్రాక్టర్‌లు ఎవరూ ముందుకు రాకపోవడంతో పంపిణీ ఉంటుందా ? ఉండదా? అని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

*ఒకటి డిస్‌క్వాలిఫై* 

 

సిద్దిపేట జిల్లాలో చేపల పిల్లల పంపిణీ కోసం ఈనెల 19న టెండర్లు ఓపెన్‌ చేశాం. అందులో నలుగురు టెండర్‌ వేయగా ఒకరు డిస్‌క్వాలిఫై. ప్రాథమిక పరిశీలనలో ముగ్గురు ఓకే కాగా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు త్వరలో ఫిష్‌ సప్లయర్స్‌ను ఫిజికల్‌గా వెళ్లి పరిశీలిస్తాం. అంతా ఓకే అనుకుంటే త్వరలో చేపల పంపిణీ జరుగుతుంది. 

 

– వరదారెడ్డి, ఎఫ్‌డీఓ

 

జిల్లా చెరువులు టెండర్లు (చేపపిల్లలు) గత సంవత్సరం 

 

సిద్దిపేట 1,715 2.21 కోట్లు 4.41 కోట్లు 

 

మెదక్‌ 1,654 2.62 కోట్లు 5.25 కోట్లు 

 

సంగారెడ్డి 1,160 1.77 కోట్లు 3.56 కోట్లు

 

ఈసారి సగమే!

Join WhatsApp

Join Now