దళిత యువకులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

దళిత యువకుడు లింగం పై కత్తులతో దాడి చేసిన నిందితుల పై కఠిన చర్యలు తీసుకోవాలి.

డిబిఎఫ్ జాతీయ కార్య దర్శి పి.శంకర్

సిద్దిపేట ఆగస్టు 13 ప్రశ్న ఆయుధం :

దళిత యువకుడు లింగంపై కత్తులతో దాడి చెసి హత్య యత్నం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేశారు. దాడికి గురై హస్తిన పురం లోని మమత ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న లింగంను,కుటుంబ సభ్యులను డిబిఎఫ్ నేతల పి.శంకర్,పులి కల్పన,పర్శరాముల బృందం పరామర్శించినది.ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్,రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన లు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల కింద దుర్గమాత ఉత్సవంలో దళితుల పై వివక్ష పాటించిన సమయంలో జరిగిన గొడవలను దృష్టి లో పెట్టుకొని పధకం ప్రకారం ఇంట్లో వున్న లింగం ను శనివారం నాడు రాత్రి బక్కుయ్య గౌడ్ మందు తాగడానకి పిలిచి మద్యం సెవించిన తర్వాత మరో నలుగురి కలిసి విచక్షణ రహితంగా కత్తులతో మూకుమ్మడి దాడి చెసి 24 కత్తిపొట్లు పొడిచి చనిపొయడాని వదిలెసి పారిపొయరన్నారు.చుట్టుపక్కల వారు,పెట్రొలింగ్ లు పొలీసుల ఆసుపత్రి కి తరలించారన్నారు.ఇప్పటికె నిందితుల పై కేసు నమోదు చెసి ముగ్గురిని అరెస్టు చెశారని,మరొ ముగ్గురని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.నగరంలో ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స ఖర్చులు ప్రభుత్వమె భరించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటి చట్టం ప్రకారం బాధిత కుంటుంబానికి తక్షణ సహాయం, నష్టపరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని కోరారు.

Join WhatsApp

Join Now