దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

*దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి*

*పి ఏ సి ఎస్ డైరెక్టర్ నన్నే బోయిన రవి యాదవ్*

*ఇల్లందకుంట ఏప్రిల్ 23 ప్రశ్న ఆయుధం*

జమ్మూ కాశ్మీర్ లోని “పహాల్గం” లో జరిగిన ఉగ్రదాడిని కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని మల్యాల సొసైటీ డైరెక్టర్ నన్నే బోయిన రవి యాదవ్ తీవ్రంగా ఖండించారు.అదే విధంగా దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అనంతరం రవి యాదవ్ మాట్లాడుతూ అభం శుభం తెలియని, విహారయాత్రకు వచ్చిన పర్యాటకులు మరణించడం దురదృష్టకరమని,భారత ప్రభుత్వం తక్షణమే దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పార్టీలకతీతంగా ముక్తకంఠంతో దాడిని ఖండించాలని కోరారు

Join WhatsApp

Join Now