లక్షన్నర లోపు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు.రైతుభరోసా సొమ్ము నేటి నుంచి బ్యాంకుల్లో తీసుకోవచ్చు: తుమ్మల

*లక్షన్నర లోపు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు.రైతుభరోసా సొమ్ము నేటి నుంచి బ్యాంకుల్లో తీసుకోవచ్చు: తుమ్మల*

తెలంగాణలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఆర్థికసాయం చేస్తామన్నారు.

రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందిస్తామని తెలియజేశారు.

లక్షన్నర లోపు ఆదాయం ఉన్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు.

మార్చి 31వ తేదీ నాటికి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఈ ఏడాది రైతుభరోసా కింద ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.

భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రెండు విడతలుగా రూ.12 వేలు ఇస్తామని పేర్కొన్నారు.

ఆదివారం మల్లేపల్లి గ్రామసభలో మంత్రి మాట్లాడారు.

రైతులకు యాసంగికి పెట్టుబడి సాయం, కూలీలకు రూ.6 వేలు ఆదివారం అర్ధరాత్రి నుంచే ఖాతాల్లో పడతాయని, సోమవారం నుంచి బ్యాంకుల్లో నగదు తీసుకోవచ్చన్నారు.

Join WhatsApp

Join Now