పోటీ చేయాలనుకునే వారు వంద మందితో ప్రాథమిక సభ్యత్వం చేయించాలి

పోటీ చేయాలనుకునే వారు వంద మందితో ప్రాథమిక సభ్యత్వం చేయించాలి

ప్రశ్న ఆయుధం న్యూస్, నవంబర్ 11, కామారెడ్డి :

కామారెడ్డి పట్టణ కార్యవర్గ సమావేశం బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆకుల భరత్ అధ్యక్షతన పట్టణంలోని 34 వ వార్డు పరిధిలో గల ఆర్యసమాజ్ మందిరంలో సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని 49 వార్డులలో పార్టీ సభ్యత్వ నమోదు చురుకుగా కొనసాగాలని, రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా పోటీ చేయాలి అనుకునే వారు తప్పక 100 మంది తో ప్రాథమిక సభ్యత్వం చేయించి క్రియాశీల సభ్యులుగా కావాలని అన్నారు. అన్ని వార్డుల్లో పార్టీ సభ్యత్వం కావాలని అన్నారు. కామారెడ్డి పట్టణంలో 30 వేళ సభ్యత్వం పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now