పనిచేసే వారికి గుర్తించి పదవులు ఇవ్వాలి

పనిచేసే వారికి గుర్తించి పదవులు ఇవ్వాలి

*మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎంఏ హకీమ్

పనిచేసే వారికి గుర్తించి పదవులు ఇచ్చినట్లయితే ఆ పదవులకు న్యాయం జరుగుతుందని మాజీ కు కో ఆప్షన్ సభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎంఏ హకీమ్ అన్నారు సోమవారం కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తెల్ల రవికుమార్ ను ఘనంగా సత్కరించారు తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా తెల్ల రవికుమార్ ను నియమించినందుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో 25 ఏళ్లుగా ఉన్న ఆయన అందించిన సేవలను కొనియాడారు ఉపాధ్యాయునిగా పాఠశాల నిర్వాహకునిగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారని గుర్తు చేశారు సీనియర్ జర్నలిస్టుగా 25 సంవత్సరాల పాటు సమాజ సేవలో కొనసాగారని ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కథనాలు రాసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన వ్యక్తి అని అన్నారు పనిచేసే వారికి ఎ రంగంలో అయినా పదవులు లభిస్తే వాటికి న్యాయం జరుగుతుంది అన్నారు గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యాసంస్థ అధిపతికి రాష్ట్రస్థాయి పదవి లభించడం అభినందనీయమన్నారు కాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఉపసర్పంచ్ అర్షద్ సో హెల్ సమీర్ తదితరులు ఉన్నారు

Join WhatsApp

Join Now