విద్యా శాఖలో కాంటాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారిని రెగ్యులర్ చేయాలి.
విద్యాశాఖ-సమగ్ర శిక్షా లో కాంట్రాక్ట్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యాలని . అప్పటి వరకు మినిమమ్ టైమ్ స్కేల్ ఇవ్వనందున వివిద దశలలో నిరసనలు చేస్తామని మరియు 15 రోజులలో పరిష్కరించని ఎడల, తరువాత ఏ రోజైన నిరవదిక సమ్మెకు వెళ్తామని తమరికి తెలుపుట గురించి విద్యాశాఖ జిల్లా విద్యాధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్షాలో అంకిత భావంతో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులం, భావితరానికి బంగారు బాటలు వేసేది విద్యా శాఖ అయినప్పటికీ అదే శాఖలో పనిచేస్తున్న మేము కనీస ఉద్యోగ భద్రత లేకుండా నిజ జీవితంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నామని .
విద్యాశాఖలోని సమగ్ర శిక్షా మన రాష్ట్రంలోని విద్యారంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని . అంతే కాకుండా ఈ సమగ్ర శిక్షా లో క్రింది విదంగా రోస్టర్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరియు వ్రాత పరీక్షా ద్వారా జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ ఉన్న కమిటిచే ఇంటర్వ్యూలలో కనబర్చిన ప్రతిభ ఆధారంగా ఎంపికై వివిధ స్థాయిలలో ఉన్నామని అన్నారు.పై విధంగా సుమారు 18 సం.ల నుండి 19600 మందికి పైగా ఉద్యోగులు పాఠశాల విద్య అభివృద్ధి కోసం మా నైపుణ్యాలు మరియు కృషిని అందిస్తున్నామని . మాలో చాలా మంది ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని . మా యొక్క స్థితిగతులను ధృష్టిలో ఉంచుకొని ఈ దిగువ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రంలో కోరారు ఈ క్రింది డిమాండ్స్ ను వెంటనే పరిష్కరించాలని వినతిపత్రం కోరినట్లు తెలిపారు.
1) సమగ్ర శిక్ష ఉద్యోగులందరిని రెగ్యులర్ చెయ్యాలి. అప్పటి వరకు మినిమమ్ టైమ్ స్కేల్ =ఎం టి ఎస్) కల్పించాలి.
2) ప్రతి ఉద్యోగికి జీవిత భీమా 20 లక్షలు, ఆరోగ్య భీమా 10 లక్షల సౌకర్యం కల్పించుట.
3) ఎస్ ఎస్ ఏ ఉద్యోగులకు పదవి విరమణ చేస్తున్న వారికి బెనిఫిట్స్ కింద 25 లక్షలు ఇవ్వాలని .
4) ప్రభుత్వ మరియు విద్యాశాఖ నియమకాలలో వెయిటేజ్ కల్పించాలని .
పై డిమాండ్లతో మేము గతంలో నిరసనలు కొనసాగిన క్రమంలో వరంగల్ జిల్లాలో తేదీ: 13-09-2023న సీఎం రెడ్డి మా ధర్నా పాయింట్ వద్దకు వచ్చి మా నిరసనలకు మద్దతు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత సచివాలయం కి పిలిచి మీ డిమాండ్లను నెరవేర్చే విదంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారని.
నేటి వరకు అనేక సార్లు సీఎం కి మరియు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికి హామీ అమలు కాలేదని . కాబట్టి హామీని అమలు చేయాలని మేము 15 రోజుల పాటు వివిద రూపాలలో నిరసనలు చేస్తామని అయిననూ సీఎం మరియు ప్రభుత్వం స్పందించకుంటే తర్వాత ఏ రోజైన నిరవదిక సమ్మెకు వెళ్తామని వినతి పత్రంలో తెలియజేశారు, కాబట్టి వెంటనే మా డిమాండ్లను నెరవేర్చలని కోరారు.