*ఫిబ్రవరి 7న హైదరాబాదులో జరిగే వెయ్యి గొంతుకలు లక్ష డబ్బులు మహాకళ ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ*
*ఇల్లందకుంట ఫిబ్రవరి 2 ప్రశ్న ఆయుధం*
ఈనెల 7న హైదరాబాదులో జరిగే వెయ్యి గొంతుకలు లక్ష డబ్బులు మహా కళా ప్రదర్శన పోస్టర్ను ఇల్లందకుంట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇల్లందకుంట మండల ఇన్చార్జి ఎర్ర ఆదిత్య ఎమ్మార్పీఎస్ ఫౌండర్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఆవిష్కరించారు వెయ్యి గొంతుకలు లక్ష డప్పులు మహా కళా ప్రదర్శన తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి రామంచ భారత్ హాజరై మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ 30 ఏళ్లుగా ఏబిసిడి వర్గీకరణ కోసం చేసిన పోరాట ఫలితంగా అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు ఒకటి 2024 నాడు ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా దామాషా ప్రకారం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసుకోవచ్చని తీర్పునిస్తే ఒకే ఒక్క మాల సామాజిక వర్గం లో ఉన్నటువంటి సంపన్నులు సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేయాలని ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా సభలు సమావేశాలు పెట్టి మాదిగ జాతిని సుప్రీంకోర్టు తీర్పుని భారత రాజ్యాంగాన్ని అంబేడ్కర్ ని అవమానించిన దానికి నిరసనగా ఫిబ్రవరి 7 తారీఖు నాడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరగబోయే లక్ష డబ్బులు వెయ్యి గొంతులు మహాకళా ప్రదర్శన కార్యక్రమానికి కవులు రచయితలు గాయకులు మేధావులు బిసి ఓసి కుల సంఘాల నేతలు బిసి ఓసి సాంస్కృతిక విభాగాల కళా నేతలు సామాజిక మార్పులు కోరుకునే ప్రజా సంఘాలు నేతలు ప్రజాస్వామికవాదులు ఇంటలెక్చువల్ మేధావులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్ర ఆదిత్య తో పాటు శనిగరపు సంపత్ మేకల యాదగిరి పోడేటి అనిల్ జీడి సదానందం పుల్ల సతీష్ కుమార్ రేణిగుంట్ల తారక రామారావు రామ్ శివ తదితరులు పాల్గొన్నారు