ప్రశ్న ఆయుధం సుజాతనగర్ మండల 13 మార్చ్ చోరీ కేసులో ముగ్గురినిఅ
రెస్టు చేసినట్లు కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ తెలిపారు ఆయన వివరాల ప్రకారం సుజాతనగ ర్ మండలం సర్వారం గ్రామానికి చెందిన జర్పుల నరేశ్ ఈ నెల 7న తన బాబాయి కిషన్ ఇంట్లో చొరబడి, బీరువాలోని రూ.5.20లక్షలు, అరతులం బంగారం దొంగిలించాడు. అదే రోజు ఖమ్మం వెళ్లి, రూ.20 వేలతో ఫోన్ కొనుగోలు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ రమాదేవి కేసు నమోదు చేశారు. బుధవారం వేపలగడ్డ రైల్వే బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీ చేపడుతుండగా.. పోలీసు లను చూసి, పారిపోయే ప్రయత్నం చేశాడు. అతన్ని పట్టుకొని విచారించగా చోరీ చేసిన విషయం ఒప్పు కున్నాడు. గతంలో సుజాతనగర్ చంద్రుగొండ జూ లూరుపాడు కొత్తగూడెం ఏరియాల్లో ట్రాన్స్ ఫార్మర్లు పగులగొట్టి, కాపర్వైరు ఎత్తుకెళ్లినట్లు చెప్పాడు. దాన్ని కొత్తగూడెంలోని బెల్లంకొండ ఈశ్వర్ రావు
మాట్లాడుతున్నడీఎస్పీ రెహమాన్
అనే స్క్రాప్ షాప్ నిర్వాహకుడికి విక్రయించినట్లు తెలిపాడు. ఈశ్వర్ రావు విచారించగా పాల్వంచకు చెందిన కొంచాడ సత్యంకు అమ్మినట్లు పేర్కొన్నాడు. దీంతో వారి వద్ద నుంచి మొత్తం రూ.7.19 లక్షలు బంగారం ఫోన్ స్వాదీనం తీసుకొని, ముగ్గురినీ అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై రమాదేవిలను ఎస్పీ రోహిత్ రాజు అభినందించి, రివార్డు ప్రకటిం చారని చెప్పారు