*వ్యవసాయ మార్కెట్లో తెల్ల బంగారానికి గరిష్ట (పత్తి )ధర రూ 7800*
*మార్కెట్ యార్డుకు వరుసగా మూడు రోజులు సెలవులు.*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 20*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తికి గరిష్ట ధర రూ 7800 పలికింది శుక్రవారం 18 వాహనాలలో 99 క్వింటాళ్ల విడిపత్తిని మార్కెట్ యార్డుకు రైతులు విక్రయానికి తీసుకువచ్చారని గరిష్ట ధర రూ 7800, మోడల్ ధర రూ 7600, కనిష్ట ధర రూ 6,200 ధరలు నిర్ణయించి ఖరీదు వ్యాపారులు పత్తిని కొనుగోలు చేశారు. 8 మంది రైతులు 14 క్వింటాళ్ల పత్తిని సంచుల్లో విక్రయానికి తీసుకువచ్చారని సంచుల్లో తీసుకువచ్చిన పత్తి గరిష్టదర రూ 7011; మోడల్ ధర రూ 66 51, కనిష్ట ధర రూ 6,511 పలికిందని
మార్కెట్ యార్డుకు వరసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు శనివారం రోజున వారాంతపు మార్కెట్ యార్డ్ కు సెలవు ఆదివారం రోజున మార్కెట్ కు సాధారణ సెలవు సోమవారం రోజున జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి మృతి చెందగా వారికి సంతాపం తెలియజేస్తూ అడ్తి, ఖరీదు వ్యాపారస్థుల విన్నపం మేరకు మార్కెట్ యార్డ్ కు సెలవు ప్రకటించారు తేది 24.09.2024 మంగళవారం రోజున మార్కెట్ ప్రారంభం అగునని మార్కెట్ అధికారులు ప్రకటనలో తెలిపారు.