Site icon PRASHNA AYUDHAM

కన్కల్‌లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా

IMG 20251230 190235

కన్కల్‌లో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా

శ్రీ సీతాసమేత శ్రీరామచంద్ర స్వామి ఆలయంలో అభిషేకాలు, పూజలు, 

సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం డిసెంబర్ 30

కామారెడ్డి జిల్లా కన్కల్ గ్రామంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ సీతాసమేత శ్రీరామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం, విశేష పూజలు నిర్వహించగా, భజన కార్యక్రమాలు భక్తులను అలరించాయి. అనంతరం ఆలయ ప్రాంగణంలో సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడగా, గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమాల నిర్వహణలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు సహకారం అందించారు.

Exit mobile version