పార్టీలకతీతంగా మున్నూరు కాపులను గెలిపించుకోవాలి
జమ్మికుంట ఆగస్టు 3 ప్రశ్న ఆయుధం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలకతీతంగా మున్నూరు కాపు కుల సోదరులను గెలిపించుకోవాలని మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పొనగంటి మల్లయ్య, సింగిల్ విండో అధ్యక్షులు పొన్నగంటి సంపత్ అన్నారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలో దుబ్బ మల్లన్న దేవస్థానం ఆవరణలో మున్నూరు కాపు కుల బంధువుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా మున్నూరు కాపు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పొనగంటి మల్లయ్య, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు ఏబూసి శ్రీనివాస్ మండల అధ్యక్షుడు తోట లక్ష్మణ్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఎడ్ల రాజేందర్ లను ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మున్నూరు కాపు కుల బాంధవులు వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు పొనగంటి సంపత్ నాయకులు ఆకుల రాజేందర్ పటేల్ పొనగంటి సారంగం, కాసర్ల రాములు, మర్రి అవినాష్, పంతాటి రవీందర్ మర్రి తిరుపతి పొనగంటి రవీందర్ పొనగంటి శ్రీధర్ చంద మహేందర్, ఆకుల పోశయ్య, పూరెల్ల రాకేష్ తదితరులు పాల్గొన్నారు