Site icon PRASHNA AYUDHAM

డ్రంకన్ డ్రైవ్‌లో ముగ్గురికి జైలు, ఐదుగురికి జరిమానా

IMG 20250926 WA0018 1

నిజామాబాద్, సెప్టెంబర్ 26 (ప్రశ్న ఆయుధం):

మద్యం సేవించి వాహనాలు నడిపిన ఘటనలో ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు, ఇన్‌స్పెక్టర్ పి. ప్రసాద్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26న కౌన్సిలింగ్ నిర్వహించబడింది. అనంతరం నిందితులను సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ ముందు హాజరు పరచగా, వారి తీర్పుతో ముగ్గురికి జైలు శిక్ష, ఐదుగురికి జరిమానాలు విధించబడ్డాయి.

వివరాలు ఇలా ఉన్నాయి:

8500/- జరిమానా విధింపబడిన నిందితులు:

1. నీలవేణి శామ్సన్ (తండ్రి సదానందం), నివాసం: కంటేశ్వర్

2. శిరవేణి నరేందర్ (తండ్రి లింగయ్య), నివాసం: విరనగుట్ట

3. ఇతర ఇద్దరు వ్యక్తుల వివరాలు తెలియజేయలేదు

రెండు రోజుల జైలు శిక్ష విధించబడిన నిందితులు:

1. కుంకి బాబు (తండ్రి శంకరయ్య), నివాసం: హనుమాన్ ఫారం

2. శిరవేణి నరేందర్

3. నీలవేణి శామ్సన్

ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.

Exit mobile version