బీఆర్ఎస్ చుట్టూ బిగుసుతున్న ఉచ్చు..!!

బీఆర్ఎస్ చుట్టూ బిగుసుతున్న ఉచ్చు..!!

గొర్రెల పథకం కుంభకోణంపై ఈడీ దృష్టి..!

2015లో అమలైన గొర్రెల పంపిణీ పథకం విలువ రూ. 4,000 కోట్లు..!

తక్కువ ధర గొర్రెలను ఎక్కువ బిల్లులుగా చూపిన ఆరోపణలు..!!

అధికారులు–మధ్యవర్తుల కుమ్మక్కుతో నిధుల మాయజాలం..!!

పథకంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగినట్లు ఆధారాలు..!!

ఈడీ రంగంలోకి దిగడంతో బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్..!

హైదరాబాద్, జూలై 31:

బీఆర్ఎస్ హయాంలో అమలైన గొర్రెల పంపిణీ పథకం ఇప్పుడు పార్టీలో తలదాపుగా మారుతోంది. 2015లో ప్రారంభించిన ఈ పథకానికి ప్రభుత్వం రూ.4,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. కానీ కొనుగోళ్లు, సరఫరాలో భారీ గందరగోళం, మోసాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తక్కువ ధరకు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన గొర్రెలను రెట్టింపు ధరలుగా చూపించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అధికారులు, మధ్యవర్తులు కలసి మోసం చేశారని ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఈ కుంభకోణంపై దృష్టి పెట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే విచారణ ప్రారంభించింది. మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ.. సంబంధిత బిల్లులు, లావాదేవీలను శోధిస్తోంది.

ఈ పరిణామాలతో బీఆర్ఎస్ నేతల్లో తీవ్ర ఉత్కంఠ మొదలైంది. ఈ స్కాంలో పలువురు కీలక నేతలు, మాజీ అధికారులు ఆరోపణల జాబితాలో ఉన్నట్లు సమాచారం. దర్యాప్తు మరింత లోతుగా సాగితే పార్టీకి పెద్ద దెబ్బ తగిలే అవకాశముంది.

Join WhatsApp

Join Now

Leave a Comment