మలేరియా మహమ్మారిని కట్టడి చేయండి…!

*మలేరియా మహమ్మారిని కట్టడి చేయండి…!*

*మలేరియా, డెంగ్యూ మరణాలు లేకుండా చర్యలు చేపట్టండి

*మందులు అందుబాటులో ఉంచండి*

*క్షేత్రస్థాయిలో పరీక్షలు నిర్వహించండి

*డెంగ్యూ పట్ల అప్రమత్తం చేయండి*

*విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి

*ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా మలేరియా అధికారిని కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 1 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తమహేశ్వరరావు

పార్వతీపురం:

పార్వతీపురం మన్యం జిల్లాను వణికిస్తున్న మలేరియా మహమ్మారిని కట్టడి చేయాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఓబిసి జిల్లా చైర్మన్ వంగల దాలినాయుడు, జిల్లా నాయకులు కోలా కిరణ్ కుమార్, మండల అధ్యక్షులు తీళ్ళ గౌరీ శంకరరావు తదితరులు జిల్లా మలేరియా అధికారిణి వై.మణితో జిల్లాలో విజృంభిస్తున్న మలేరియా పై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయన్నారు. దోమలు బెడద కూడా ఆరంభమైందన్నారు. ఇప్పటికే పలుచోట్ల మలేరియా విజృంభించిందన్నారు. తక్షణమే రెండో విడత మలేరియా నివారణ మందుల పిచికారి చేయాలన్నారు. గిరిజన, మైదాన, పట్టణ ప్రాంతాల్లో దోమల నివారణ, మలేరియా కట్టడి కి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జిల్లాలో డెంగ్యూ ఫీవర్ లు కూడా గత ఏడాదిని బట్టి చూస్తే ఆరంభమయ్యే అవకాశం ఉందన్నారు. కాబట్టి మలేరియా, డెంగ్యూ వివరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్యంగా వసతి గృహాల విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అధికంగా మలేరియా కేసులు నమోదయ్యే గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించించాలన్నారు. క్షేత్రస్థాయిలో పరీక్షలు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో మలేరియా వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. డెంగ్యూ పట్ల అప్రమత్తం చేయాలన్నారు. ఈ కాలంలో కూడా జ్వరాలకు మనుషులు చనిపోవడం బాధాకరమన్నారు. ముఖ్యంగా విద్యార్థుల మరణాలు లేకుండా చూడాలన్నారు. వసతి గృహాల విద్యార్థులు ఇళ్లకు వెళ్లేటప్పుడు మరణాలు సంభవిస్తున్నాయని, అటువంటి వారిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పట్టణాలకు కూడా దోమల నివారణ మందు సరఫరా చేయాలన్నారు. గత ఏడాది డెంగ్యూ జ్వరాలు వేధించిన వివేకానంద కాలనీ, జగన్నాధపురం, టౌన్ లోని పలు వీధుల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దోమల నివారణకు సంబంధిత పంచాయతీ, మున్సిపల్ అధికారులు సిబ్బందితో సమన్వయం ఏర్పాటు చేసుకొని పారిశుధ్య నిర్వహణ, దోమల నిర్మూలన చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment