సాగు నీటి సారు, జర ఇటు సూడు!” తిమ్మాపూర్ రైతుల ఆవేదన

“సాగు నీటి సారు, జర ఇటు సూడు!” తిమ్మాపూర్ రైతుల ఆవేదన

 

ఎల్లారెడ్డి, సెప్టెంబర్12(ప్రశ్న ఆయుధం):

 

* చెరువు కట్ట, ఫీడర్ కాల్వలు తెగిపోయిన స్పందించని అధికారులు

 

* రైతులు సొంత ఖర్చుతో పునరుద్ధరణ పనులు చేపట్టారు

 

* భారీ వర్షాలతో ఆ పనులు కూడా వృథా అయ్యాయి

 

* నీటి సరఫరా లేక వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి

 

* *”సాగు నీటి సారు, జర ఇటు సూడు!”* అంటూ ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యంపై రైతుల తీవ్ర ఆగ్రహం

 

* తక్షణ చర్యలు లేకుంటే కలెక్టరేట్ వద్ద ధర్నా హెచ్చరిక

 

ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల చెరువు కట్ట, ఫీడర్ కాల్వలు తెగిపోయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిరాశలో రైతులు సొంతంగా మరమ్మత్తు పనులు చేపట్టారు.

 

కానీ, తిరిగి కురిసిన భారీ వర్షాలతో రైతుల శ్రమ వృథా అయింది. నీటి సరఫరా నిలిచిపోవడంతో వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి.

 

రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ “సాగు నీటి సారు, జర ఇటు సూడు!”అంటూ —అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. పంటలు నాశనమైతే దానికి బాధ్యత పూర్తిగా అధికారులదే అని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now