త్వరలో కొత్త పార్టీ పెడుతాం: తీన్మార్ మల్లన్న
Jul 12, 2025,
తెలంగాణ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తాజాగా సంచలన ప్రకటన చేశారు. త్వరలో సొంత పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అగ్రవర్ణల పార్టీలు బీసీలకు ఎప్పటికీ కిరాయి ఇండ్లేనని, అందుకే తమ కోసం అతి త్వరలోనే కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఓ గుర్తు ఉన్నట్లు త్వరలోనే బీసీలకు కూడా ఓ గుర్తు రాబోతుందని, అప్పుడు బీసీ ఓట్లు బీసీలకేనని పేర్కొన్నారు.