**తిరుమల మిడోస్ కాలనీ సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు**
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జులై 6
మేడ్చల్ శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి ఆదివారం రోజు జిల్లా ఇన్‌చార్జి మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తిరుమల మిడోస్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
కాలనీలో తాగునీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్ల పరిస్థితులు, పారిశుద్ధ్య సమస్యలు వంటి అంశాలపై చామకూర మల్లారెడ్డి వివరించారు. సమస్యలను గమనించిన మంత్రి శ్రీధర్ బాబు, సంబంధిత శాఖాధికారులను వెంటనే ఆదేశించి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల కష్టాలను తేలిక చేయడం ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మంద సంజీవరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కొత్త చక్రపాణి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.