పంజాబ్‌కు చెందిన ఓ కంపెనీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు భారీ విరాళం అందించింది. ఏకంగా 21 కోట్ల రూపాయలను ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు విరాళంగా ఇచ్చింది. పంజాబ్‌కు చెందిన ట్రైడెంట్ గ్రూప్. ఈ సంస్థకు చెందిన రాజిందర్ గుప్తా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి ఈ విరాళం తాలూకు చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఈవో వారిని అభినందించారు. మరోవైపు ప్రాణదాన ట్రస్టు సేవలను గుర్తించే ఈ విరాళం ఇచ్చినట్లు రాజిందర్ గుప్తా తెలిపారు.మరోవైపు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే శ్రీవెంకటేశ్వర ప్రాణదానం ట్రస్టు ద్వారా నిరుపేదలకు ఉచితంగా వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కిడ్నీ, గుండె, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న వారికి ఈ ట్రస్టు అండగా నిలుస్తోంది. ఎస్వీ ప్రాణదాన ట్రస్టు ద్వారా ఇలాంటి వారికి ఉచితంగా వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని స్విమ్స్, బర్డ్, ఎస్వీఆర్ఆర్, మెటర్నిటీ ఆసుపత్రులలోఉచితంగా చికిత్స అందిస్తారు. ఈ ట్రస్టు చేపడుతున్న సేవా కార్యక్రమాలను గుర్తించి పలువురు విరాళాలు ప్రకటిస్తుంటారు. ఈ క్రమంలోనే పంజాబ్ సంస్థ కూడా 21 కోట్లు విరాళంగా ఇచ్చింది.