- ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం లో గల అర్జున వాడలో తన ప్రస్థానాన్ని మొదలెట్టి సుజాతనగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసించి, సుజాతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిని పూర్తిచేసుకుని
కొత్తగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివి ఉన్నత చదువులకై ప్రయాణం చేస్తూ చేస్తున్న సమయంలో ఆర్థిక పరిస్థితులు సహకరించక తన చదువుకొని కొనసాగించలేక మధ్యలోనే చదువు ఆపేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ఆశయం ఆలోచన విధానం ప్రజల కొరకై ప్రజా శ్రేయస్సు కొరకై ముందుకు పోవాలని తపన కలిగి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని పునుకపుచ్చుకొని
ఎన్నో బహుజన ఉద్యమాలకు నాందిపా లికి బహుజనఉద్యమాలలో పాల్గొని అంచలంచెలుగా ఎదిగి ఢిల్లీ స్థాయిలో అంబేద్కర్ జాతీయ అవార్డుకి ఎంపికై 2022లో అంబేద్కర్ జాతి అవార్డు తీసుకొని బహుజన ఉద్యమాలకు ఊపిరి పోసే దిశగా ఎందరో మహనీయుల ఆశయాలనుత్యాగాలను స్మరించుకుంటూ వారి జీవితాలను త్యాగాలనుముందుకు తీసుకుపోయే దిశలో తాను ముందు పాత్ర పోషించిన తీరు అమోఘమైనదని తాను జీవితంలో ఎంతో ఉన్నత స్థితిని అనుభవించాలని ఆలోచన ఆశ లేకుండా సాధారణ జీవితం గడపాలని దృఢ సంకల్పం మనోదీక్ష ఆత్మస్థైర్యం ఆయనకు కలిగిన ఆయుధాలు ఎప్పుడు జాతి జాతీయ అభ్యుదయకై పాటుపడే మనస్తత్వం ఉన్న గొప్ప మనిషి మాదిగ జాతిని ఎప్పుడు ముందు వరుసలో నిలవాలని ఆయన తపన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వేల్పుల భాస్కర్ అన్నారు.
దామెర్ల సర్వేసు మాట్లాడుతూ
మంచితనానికి మారుపేరు ఎక్కడ పొగడ్తలకు లొంగని మనిషి నిరాడంబరుడు మొఖంపై ఎప్పుడు చెరగని చిరునవ్వు అందరిని ప్రేమగా ఆప్యాయంగా పలకరించే మనసున్న మహారాజు సుజాతనగర్ మాదిగ జాతిలో పుట్టడం చాలా గర్వకారణం అని ఆయన కొనియాడారు
మంద రాజు మాట్లాడుతూ
కత్తి బాలకృష్ణ ఒక పెను విప్లవం ప్రభంజనం ఆయన ఒక సైన్యం ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కొనే ఒక విస్పోటనం మాదిగ జాతి ఆత్మగౌరవ యుద్ధ పోరాట వీరుడు ఆయన వ్యక్తిత్వానికి తగిన గౌరవం టీజేయంయు కల్పించిందని వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు
అంకి శెట్టి రామకృష్ణ మాట్లాడుతూ
సుజాతనగర్ మండల మాదిగ ఐక్యవేదిక ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూ జాతి ఉద్యమాలలో పాల్గొంటూ చురుకైన పాత్ర పోషిస్తున్న నా సహచర మిత్రుడు అంగు ఆర్భాటానికి ఆరాటపడని ఆప్తమిత్రుడు అని ఆయన కొనియాడారు గుండేటి వెంకట్ రాములు మాట్లాడుతూ
తమ్ముడు స్నేహ స్వభావి ఉన్నత విలువలకు ప్రాథమిక గొప్ప మనిషి సాహృదయుడు ఎప్పుడైనా పలకరింపులు ఆప్యాయత అనురాగం కలగలిపిన తమ్ముడు తాను అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సుజాతనగర్ మండల మాదిగ ఐక్యవేదిక తరపున కత్తి బాలకృష్ణ కు తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ (డీజే ఎం యు) తనపై గౌరవించి ఈ పదవికి సరైన అర్హుడని ఆయనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఈ పదవి ఇచ్చినందుకు తెలంగాణ జర్నలిస్ట్ మీడియా యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులకు మరియు రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులకు మరియు జాతీయ అధ్యక్షులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుజాతనగర్ మండల మాదిగ ఐక్యవేదిక సభ్యులు
సుజాతనగర్ మండల ఐక్యవేదిక అధ్యక్షులు వేల్పుల భాస్కర్ ఉపాధ్యక్షులు అంకి శెట్టి రామకృష్ణ ఆర్గనైజింగ్ సెక్రటరీ దామెర్ల సర్వేశ్వరరావు సహాయ కార్యదర్శి కేసు బొక్క వెంకటేశ్వర్లు గౌరవ సలహాదారులు గుండేటి పెదరాములు ప్రత్యేక ఆహ్వానితులు మంద రాజు మొరిపిటి నగేష్ గుండేటి గోపయ్య కత్తి లక్ష్మణ్ గంగపురి వెంకటేశ్వర్లు కత్తి నరసింహారావు మండల నాయకులు మురిపిటి నాగేష్ కాకటి తిరుపతయ్య సిలబగు సురేష్ గుండేటి దుర్గా వేల్పుల రాజు గుండేటి బాలకృష్ణ కాకాని నరసింహారావు కమిటీ సభ్యులు మురిపిటి చారి బాబు గుండేటి వంశీ కత్తి శ్రీను రాములు నరసింహారావు ఎక్కిరాల శీను కాకా టి కృష్ణ కాకాటి అశోక్
మరి కొంతమంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మో
టీజేఎంయు జిల్లా ఉపాధ్యక్షుడు కత్తి బాలకృష్ణను ఘనంగా సన్మానించిన మండల మాదిగ ఐక్యవేదక
by Naddi Sai
Published On: November 13, 2024 7:48 pm
